నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎన్ఎస్యూఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ని రద్దు చేయాలని... పరీక్షలు లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన రాష్ట్ర నాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు.
నిజామాబాద్లో ఎన్ఎస్యూఐ నాయకుల ధర్నా
అరెస్టు చేసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు.
అరెస్టు చేసిన రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను బేషరతుగా విడుదల చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజు అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు వివరించారు. పిల్ కోర్టులో ఉండగానే పరీక్షల నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు సాయి, రాహుల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:సిబ్బంది అపార్థం చేసుకోవద్దు.. లోపాలను సరిదిద్దాలనే.. : హైకోర్టు