తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాసంస్థల్లో సమస్యలపై సీఎంకు లేఖ

వచ్చేనెలలో విద్యాసంస్థలు ప్రారంభిస్తున్న తరుణంలో కల్పించాల్సిన సౌకర్యాలపై నిజామాబాద్ జిల్లా ఎస్​ఎఫ్​ఐ కమిటీ నాయకులు సీఎంకు లేఖ రాశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

nizamabad  SFI leaders letter to chief minister on issues in educational institutions
సీఎం కేసీఆర్​కు నిజామాబాద్​ ఎస్​ఎఫ్​ఐ నాయకుల లేఖ

By

Published : Jan 13, 2021, 6:02 PM IST

కరోనా దృష్ట్యా విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నాయకులు కేసీఆర్​కు లేఖ రాశారు. విద్యారంగ బలోపేతానికి ప్రధానంగా తొమ్మిది డిమాండ్లను ప్రస్తావించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విగ్నేశ్ తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించనున్న తరుణంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులను ఉచితంగా అందించాలని లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో వైద్యశాలలు, మెడికల్ దుకాణాలు, అంబులెన్సులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లాకు ఐదు కోట్ల విద్యా సంక్షేమ నిధిని అదనంగా అందించాలని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో వేణు, మహేష్, మారుతి, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :సంక్రాంతికి ఊరికెళితే ముందే చెప్పండి: సీపీ

ABOUT THE AUTHOR

...view details