తెలంగాణ

telangana

ETV Bharat / state

అధిక ఉష్ణోగ్రతలతో బేజారెత్తుతున్న నిజామాబాద్​ వాసులు - high temperatures in nizamabad

ఓవైపు కరోనా బెంగతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. మరోవైపు భానుడు జనాలను ఠారెత్తిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల జనం బేజారెత్తిపోతున్నారు. సహజంగానే ఎండలు అధికంగా ఉండే నిజామాబాద్​ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Nizamabad residents facing problems with high temperatures
అధిక ఉష్ణోగ్రతలతో బేజారెత్తుతున్న నిజామాబాద్​ వాసులు

By

Published : May 5, 2020, 4:03 PM IST

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ ఏడాది సైతం ఏప్రిల్ నెల నుంచే ఎండలు క్రమంగా పెరుగుతుండగా.. లాక్​డౌన్ కారణంగా ప్రజలు బయటకు రాకపోవడం వల్ల ప్రభావం తెలియలేదు. ఇప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తుండటం వల్ల భగభగ మండుతున్న ఎండలతో జనం బేజారెత్తిపోతున్నారు.

మే ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మే చివరి వరకు మరింతగా ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ అధిక ఉష్ణోగ్రతలతో లాక్​డౌన్ నేపథ్యంలో అత్యవసర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చూడండి:ప్రతి ఉత్పత్తిపై ఓరియంటల్ ఇన్సూరెన్స్​: నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details