ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు ఎంత చెప్పినా కొందరి చెవికెక్కడం లేదు. కరోనా ఫలితంగా ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందజేయడానికి ప్రజల ఖాతాల్లో నగదు జమ చేశారు.
నిజామాబాద్‌లో బ్యాంకుల వద్ద గుమిగూడిన జనం - no social distance at nizamabad banks
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. భౌతిక దూరం పాటించకుండా నిజామాబాద్‌లోని పలు బ్యాంకు, ఏటీఎంల వద్ద బారులు తీరడమే దీనికి నిదర్శనం.
నిజామాబాద్‌లో బ్యాంకుల వద్ద గుమిగూడిన జనం
ఈ నగదు తీసుకోవడానికి నిజామాబాద్‌లో కొందరు.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరారు. ఈ సమయంలో ప్రజలెవరూ భౌతిక దూరం పాటించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
బ్యాంకుల వద్ద ఒకరిద్దరు పోలీసులుంటున్నా ఖాతాదారులు వారి మాటలు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.