వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, వర్షపు నీరు మల్లింపు, హరితహారం తదితర అంశాలపై ఇంజినీర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు కలుషితం కాకుండా పైప్లైన్ లీకేజీలను అరికట్టాలని అధికాలను ఆదేశించారు.
స్వచ్ఛమైన నీరు అందిద్దాం... రోగాలను అరికడదాం: మేయర్ నీతూ కిరణ్ - 6th phase harithahaaram in nizamabad
నిజామాబాద్లో అధికారులు, ఇంజినీర్లతో మేయర్ నీతూ కిరణ్ సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరందించి సీజనల్ రోగాల నుంచి కాపాడాలని నీతూ కిరణ్ అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు, హరితహారం కార్యక్రమాలపై సమీక్షించారు.
'స్వచ్ఛమైన నీరు అందిద్దాం... రోగాలను అరికడదాం'
నీటి కలుషితం ద్వారా అనేక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా నాలాల పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ దీపాల సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు.
ఆరో విడత హరితహారం కార్యక్రమ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా... ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయాలని సూచించారు.
ఇవీ చదవండి:పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ
Last Updated : Jun 24, 2020, 8:09 PM IST