నిజామాబాద్ నగరపాలక సంస్థలో దోమల బెడద తగ్గించటానికి మున్సిపల్ జోన్లకు ఫాగింగ్ మెషీన్లను నగర మేయర్ నీతూ కిరణ్ పంపిణీ చేశారు. నగరంలో 6 మున్సిపల్ జోన్లుండగా... జోనుకు 2 చొప్పున మొత్తం 12 మెషీన్లు అందజేశారు. నిల్వ ఉన్న నీళ్లలో దోమలు ఎక్కువగా వృద్ధిచెందే అవకాశం ఉన్నందున... ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు మేయర్ సూచించారు.
ప్రజల సహకారంతోనే సత్ఫలితాలు సాధ్యం: మేయర్ నీతూకిరణ్ - sanition in nizamabad
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా... ప్రజల సహకారం అవసరమని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని 6 మున్సిపల్ జోన్లకు ఫాగింగ్ మెషీన్లు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
'ప్రభుత్వం ఎంత చేసినా... ప్రజల సహకారం అవసరం'
ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం అవసరమని.... ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జితేశ్ వి పాటిల్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.