తెలంగాణ

telangana

అంతా సన్నద్ధం... ఓపీకి వచ్చేయొచ్చు

By

Published : May 12, 2020, 1:03 PM IST

కరోనా వైరస్‌ కారణంగా నిజామాబాద్​ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిలిపేసిన ఓపీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. చిన్నచిన్న సమస్యలతో ఆస్పత్రికి వచ్చి రద్దీ పెంచవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

nizamabad district heath department latest news
nizamabad district heath department latest news

ఇందూరు జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నిలిపేసిన ఓపీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు క్యాజువాలిటీలోనే అన్ని విభాగాల వైద్యులు కూర్చొని అత్యవసర ఓపీ చూసేవారు. ఇక నుంచి ఎప్పటిలాగే ఓపీ చీటీ రాయించుకొని ఏ విభాగానికి చెందినవారు ఆ అంతస్తులో ఉండే వైద్య నిపుణుల వద్దకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మొన్నటి వరకు 300 ఉన్న ఓపీ కాస్త పెరిగి నిన్న 470కి చేరింది.

అంతా సన్నద్ధం...

శస్త్ర చికిత్సలు చేయడానికి ఆపరేషన్‌ థియేటర్లను సిద్ధం చేశారు. కొవిడ్‌-19 విభాగం ఐసోలేషన్‌ వార్డుకు కొత్త కేసులు రాకపోవడం, వార్డు ఖాళీ కావడం వల్ల అక్కడ పనిచేసిన సిబ్బందిని తిరిగి వారి వార్డులకు, ఆపరేషన్‌ థియేటర్లకు పంపించారు.

అనవసరంగా రద్దీ పెంచొద్దు...

కరోనా కారణంగా మొన్నటి వరకు అత్యవసర సేవలకు మాత్రమే ఓపీని పరిమితం చేశాం. ఇప్పటి నుంచి సాధారణ ఓపీ సేవలు సైతం ప్రారంభమయ్యాయి. ఇబ్బందికరమైన సమస్య తప్పదనుకుంటే మాత్రమే ఆస్పత్రికి రావాలి. అనవసరంగా రద్దీ పెంచి సామాజిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. మాస్కు ధరించకుంటే లోపలికి అనుమతించరు. ఓపీ చూపించుకున్న వెంటనే వెళ్లిపోవాలి.

-నాగేశ్వర్‌రావు, సూపరింటెండెంట్

ABOUT THE AUTHOR

...view details