కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పేషంట్ల ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు, వారి బంధువులు మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో క్రిమి సంహారక మందైన హైడ్రోక్లోరిన్ ద్రావణ పిచికారీ షవర్‌ను ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు.
ఆసుపత్రిలోకి రావాలన్నా వెళ్లాలన్నా ఈ షవర్ కింద నుంచే.. - ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిమిసంహారక షవర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పేషంట్లు, వారి బంధులు రోగాల బారిన పడకుండా కరోనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద రసాయనాల పిచికారీ షవర్‌ను ఏర్పాటు చేశారు.
ఆసుపత్రిలోకి రావాలన్నా వెళ్లాలన్నా ఈ షవర్ కింద నుంచే..
ఎవరైనా ఆసుపత్రికి వచ్చినా లేదా ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిన ఈ ద్వారం గుండానే వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్, ఇతర జబ్బులతో జిల్లా ఆస్పత్రికి రోజు చాలామంది వస్తుంటారని వచ్చిన వారు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండే విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రికి అత్యవసరం అయితేనే రావాలని, వచ్చిన వారు తప్పకుండా భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త