పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా తమ సమస్య పరిష్కారం కాలేదని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు నిజామాబాద్ రైతులు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరగాలని ప్రధాని మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 50 మంది రైతులు ఈరోజు నిజామాబాద్ నుంచి వారణాసికి బయలుదేరారు.
పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యం
ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, స్వచ్ఛందంగా పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. రాహుల్, మోదీలకు వ్యతిరేకంగా నిలవడం తమ ఉద్దేశం కాదని.. జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరిగితే.. పసుపు బోర్డు ఏర్పాటవుతుందనే ఆశతోనే పోటీ చేస్తున్నామన్నారు.
విమర్శించే బదులు పరిష్కరించండి