తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకు బుద్ధి చెప్పాలి' - ex mp madhu yashki goud updates

తెరాస, భాజపా రెండు ఝూట పార్టీలని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను దోచుకు తింటున్నాయని ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గజానన్ పటేల్ సన్మాన సభలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

nizamabad-ex-mp-madhu-yashki-goud-participated-in-youth-congress-president-gajanan-patel-hosted-the-function
'వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకు బుద్ధి చెప్పాలి'

By

Published : Jan 25, 2021, 11:45 AM IST

కేంద్రంలోని భాజపా రాష్ట్రంలోని తెరాస పార్టీలు సొంత ఆస్తులను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని పార్శి రాములు కల్యాణ మండపంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గజానన్ పటేల్ సన్మాన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దోపిడి పాలనకు వ్యతిరేకంగా ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్​ పరం చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నాయన్నారు. కేటీఆర్​ను సీఎం చేసేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నాడని తెలిపిన ఆయన.. కల్వకుంట్ల కుటుంబ దోపిడి పాలనకు వ్యతిరేకంగా యువత పని చేయాలని కోరారు.

బలోపేతం చేయండి..

కాంగ్రెస్ పార్టీకి వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థలే ముఖ్యమని వెల్లడించిన మధుయాష్కీ.. ఆస్తులు గడించి వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు భేషజాలకు వెళ్లకుండా పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

భవిష్యత్తు ఉండదు..

ఎవరికి భయకుండా యువ నాయకత్వం ముందుకు సాగాలని, పార్టీకి ద్రోహం చేసిన వారికి భవిష్యత్తు ఉండదన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని, దానికోసం యువనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ రావు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు: చిన్నారెడ్డి

ABOUT THE AUTHOR

...view details