తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్​ - nizamabad district news

జూన్​ 1వ తేదీ నుంచి 8వరకు గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిజామాబాద్​ జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. పనులను పరిశీలించి నివేదిక అందించడానికి 57 మంది విజిలెన్స్​ అధికారులను గ్రామాలకు పంపించినట్లు కలెక్టర్​ తెలిపారు.

nizamabad district collector inspected sanitation works in villages
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్​

By

Published : Jun 12, 2020, 9:27 PM IST

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి 8 వరకు గ్రామాలలో నిర్వహించిన పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. ఎడపల్లి మండలం నెహ్రూ నగర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వీధులన్నీ తిరిగి శానిటేషన్, ఇతర పనులను పరిశీలించారు. హరితహారం కార్యక్రమానికి ముందస్తు చర్యలు, శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్ల నిర్మాణం, తదితర అంశాలపై పరిశీలన చేసి నివేదిక అందించడానికి 57 మంది విజిలెన్స్ అధికారులను గ్రామాలకు పంపించినట్లు తెలిపారు.
కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం మొదలవడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా, సీజనల్​ వ్యాధులు రెండు కలిసి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కలెక్టర్​ తెలిపారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా శానిటేషన్ పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. శుక్రవారం 92 గ్రామ పంచాయతీలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారని వెల్లడించారు. మిగతా గ్రామపంచాయతీలను వచ్చేవారం పరిశీలిస్తామన్నారు. కలెక్టర్ వెంట జడ్పీ వైస్ ఛైర్మన్ రజిత, ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో శంకర్, ఎంపీపీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

ABOUT THE AUTHOR

...view details