తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం... గ్రామకార్యదర్శి సస్పెన్షన్ - నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి

నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలం పొత్నూర్​లో పర్యటించిన కలెక్టర్​ నారాయణరెడ్డి... గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి, క్షేత్రస్థాయి సహాయకుడిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.

nizamabad collector narayanareddy
పొత్నూర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

By

Published : Jan 9, 2020, 1:15 PM IST

పొత్నూర్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి సిరికొండ మండలంలోని పొత్నూర్​లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీధుల్లో తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

రోడ్లపై చెత్తను తొలగించ లేదని, కొత్తగా మొక్కలు నాటలేదని సర్పంచ్, అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు జరిగినట్లు కనిపించడం లేదని మండిపడ్డారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ కార్యదర్శి గంగాధర్, క్షేత్ర సహాయకుడు నవీన్​ను సస్పెండ్​ చేయాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details