మహారాష్ట్రకు దగ్గరలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు మిడతలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మిడతల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసి పలు శాఖలను భాగస్వామ్యం చేశామన్నారు.
'మిడతల విషయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి' - నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
తెలంగాణ సరిహద్దు మహారాష్ట్రలోని అమరావతిలో మిడతలు దాడి చేస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటోన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.
'మిడతల విషయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి'
మిడతలు వచ్చే సమయంలో చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయశాఖ నుంచి రైతులకు సమాచారం అందించామని తెలిపారు. ఇదే సమయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఇదీ చూడండి :తెలంగాణ ప్రజలకు త్వరలో తీపికబురు : కేసీఆర్