తెలంగాణ

telangana

ETV Bharat / state

​ కొవిడ్​ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఫోన్​చేసి ఆరా తీసిన కలెక్టర్​

గ్రామాల్లో నిర్వహిస్తున్న ఫీవర్​ సర్వేపై నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ ప్రజల అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్​లోని కంట్రోల్​ రూం నుంచి కొవిడ్​ బాధితులకు ఫోన్​ చేసి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

Telangana news
Nizamabad news

By

Published : May 25, 2021, 7:35 PM IST

ఫీవర్​ సర్వే అమలుపై జిల్లా కలెక్టర్​ ప్రజలకు ఫోన్​ చేసి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​లోని కంట్రోల్​ రూం నుంచి కొవిడ్​ లక్షణాలు ఉన్న 12 మందితో కలెక్టర్​ నారాయణ రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వస్తున్నారా..? మందులు ఇస్తున్నారా..? తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంటింటి సర్వేలో భాగంగా సర్వే బృందం పనితీరును అడిగి తెలిసుకున్నారు. వారు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అందరూ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. కొవిడ్​ పరంగా ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఏవో సుదర్శన్, డీఎంహెచ్​వో బాల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details