నిజామాబాద్ కలెక్టర్ ఛాంబర్లో టీఎస్ ఐ-పాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. టి-ఐడియా పాలసీ కింద ఇద్దరు వికలాంగులకు ట్రాక్టర్, గూడ్స్ లైట్ మోటార్ వాహనాన్ని మంజూరు చేశారు.
'నిరుపేదలకు వాహనాలు మంజూరు... '
టి-ఐడియా, టి-ప్రైడ్ పాలసీ కింద పేదలకు వాహనాలను మంజూరు చేసి... వారికి సబ్సిడీ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఆయన ఛాంబర్లో టీఎస్ ఐ-పాస్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్‌తో సమీక్ష నిర్వహించారు.
'నిరుపేదలకు వాహనాలు మంజూరు... సబ్సీడీ కూడా ఉంటుంది'
టి-ప్రైడ్ పాలసీ కింద 16 మంది ఎస్సీలకు ట్రాక్టర్లు, గూడ్స్ లైట్ మోటార్ వాహనాలు, కార్లు మంజూరు చేశారు. మంజూరు అయిన ఎస్సీ, ఎస్టీ వారికి 35 శాతం, మహిళలకు 10 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ బాబురావు, విద్యుత్ శాఖ ఎస్ఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'కరోనాకు ఆరోగ్యశ్రీ చికిత్స'పై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు