సంవత్సరం పొడవునా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా విశిష్టమైన అంశమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల బస్సును ఆయన ప్రారంభించారు.
"క్యాన్సర్‌పై 'గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్' పోరాటం ప్రశంసనీయం" - క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల బస్సును ప్రారంభించిన నిజామాబాద్ కలెక్టర్
క్యాన్సర్‌పై పోరాటంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల బస్సును ఆయన ప్రారంభించారు.
క్యాన్సర్‌పై పోరాటంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కలెక్టర్ కొనియాడారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి ఆధునిక వైద్య సంరక్షణ సమానంగా అందేలా చూడటం పౌండేషన్ ముఖ్య ఉద్దేశమని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ చినబాబు తెలిపారు. వ్యాధిని మొదటి దశలోనే గుర్తించే విధంగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మహాత్మునికి ప్రముఖుల నివాళి...