తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్​ - nizamabad district news

నిజామాబాద్​ నగర శివారులోని డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్​ నారాయణరెడ్డి పరిశీలించారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు.

nizamabad collector inspected double bedroom works
డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్​

By

Published : Jun 20, 2020, 7:43 PM IST

నిజామాబాద్ నగర శివారులోని కొత్త కలెక్టరేట్, డబుల్ బెడ్​రూం ఇళ్ల నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్​ బీ, ఇరిగేషన్, ఆర్​డబ్ల్యూఎస్ ఇంజినీర్లను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ పక్కన నిర్మాణంలో ఉన్న డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

వర్షాల వల్ల నీరు నిలిచిపోవడం వల్ల నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని తెలుసుకొని, నీటిని పక్కనే ఉన్న ఎల్లయ్య చెరువులోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడికి మెటీరియల్ తరలించేందుకు రోడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్ అండ్​ బీ ఎస్​ఈ రాజేశ్వర్ రెడ్డి, ఈఈ రాంబాబు, ఇరిగేషన్, ఆర్​డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్​.. కర్నల్‌ కుటుంబానికి పరామర్శ

ABOUT THE AUTHOR

...view details