మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్నందున.. జిల్లాకు రాకపోకలు పెరుగుతూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. ప్రజలంతా మరో 3 వారాల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సమీక్షించారు. వైరస్‌పై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.
'రాబోయే 3 వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి' - నిజామాబాద్ కొవిడ్ కేసులు
రాబోయే 3 వారాలు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. వైరస్ రెండో దశపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 15 రోజులుగా కొవిడ్ కేసులు భారీగా పెరిగాయని కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వైరస్ కట్టడికి కృషి చేయాలని కోరారు. మొదటి దశలో.. వ్యాక్సిన్, సరైన అవగాహన లేకున్నా.. అందరి సహకారంతో చాలా వరకు వైరస్ వ్యాప్తిని ఆపగలిగామని గుర్తు చేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్ వచ్చినప్పటికీ రెండో దశ దృష్ట్యా.. అంతే ఐకమత్యంతో సంఘటితంగా ఎదుర్కోవాలని అన్నారు. కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి యువత తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్‌పై వివాదాస్పద వీడియోలు... కేసు నమోదు