నాగుల పంచమి సందర్భంగా నిజామాబాద్లో నాగదేవత ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి.. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్ష్యాలు, కోడిగుడ్లు సమర్పించి దీపారాధన చేశారు. బాల్కొండలో గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి దేవతామూర్తికి జలాభిషేకం జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిపారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయాల కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమిని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
నాగుల పంచమి వేడుకలు