నేటితో ముగిసిన అగ్నిమాపక వారోత్సావాలు - nizamabad
అగ్నిమాపక వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి. సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
అగ్నిమాపక వారోత్సావాలు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అగ్ని మాపక కేంద్రంలో వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14 నుంచి జరుపుతున్న ఈ వారోత్సావాలు నేటితో ముగియనున్నాయి. ఈరోజు కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిమాపక కేంద్రంలో ఉన్న పరికరాలను ఎలా ఉపయోగిస్తారో సిబ్బంది తెలిపారు.