ఎంపీపీ పదవి కోసం ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంది - mpp
అధిష్ఠానం ఎంపీపీ పదవి ఇస్తానని మాటిచ్చింది ఒకరికి... కానీ అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థి తనకూ కావాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుని మరీ బతిమిలాడింది.
ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంది
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంపీపీ పదవి ఇస్తామని తెరాస అధిష్ఠానం ఒకరికి హామీ ఇచ్చింది. అనూహ్యంగా పెంటకలన్ నుంచి గెలిచిన తెరాస అభ్యర్థి సువర్ణ కూడా ఎంపీపీ పదవి కావాలని కన్నీళ్లు పెట్టుకుంది. ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతూ పదవి తనకే ఇప్పించాలని వేడుకుంది. ఎమ్మెల్యే సర్ది చెప్పినా సువర్ణ వినకపోవడం వల్ల ఇద్దరు ఆశావాహులకు మధ్య వాగ్వాదం జరిగింది.