తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి - ఎంపీ అర్వింద్​పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం

పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని ఎంపీ అర్వింద్​ ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా అంటే అబద్ధాల పార్టీ అని వెల్లడైందని విమర్శించారు. ఎంపీ అర్వింద్ రాజీనామా చేసి రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు.

mla-jeevan-reddy-demand-to-answer-mp-arvind-on-turmeric-board
పసుపు బోర్డు ఏమైందో అర్వింద్ చెప్పాలి: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

By

Published : Mar 16, 2021, 12:18 PM IST

పసుపు బోర్డు ఏమైందో అర్వింద్ చెప్పాలి: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్ రాశారని... రెండేళ్లైనా ఎందుకు తీసుకురాలేదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పసుపు బోర్డు ఇవ్వబోమని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అర్వింద్ రాజీనామా చేసి రైతు ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. ఎంపీ అర్వింద్​తో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ రాజీనామా చేయించాలని హైదరాబాద్​లోని గన్ పార్కు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.

అబద్ధాల పార్టీ

భాజపా అంటే అబద్ధాల పార్టీ అని వెల్లడైందని వద్ద అన్నారు. ఐటీఐఆర్, రైల్వే కోచ్ సెంటర్ ఇవ్వబోమని కేంద్రం చెప్పిందని మండిపడ్డారు. అమ్మకం పార్టీగా భాజపా మారిందని ఆరోపించారు. ప్రతిరోజు ఒక్కో సంస్థను అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస చేసిన అభివృద్ధిని గవర్నర్ చెప్పడానికి గంటకు పైగా సమయం పట్టిందన్నారు. షాదీముబారక్, రైతు బంధు, కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వడం భట్టి విక్రమార్కకు నచ్చలేదా? అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:మెట్రోకు బడ్జెట్‌లో నిధులు దక్కేనా?

ABOUT THE AUTHOR

...view details