మిషన్ భగీరథ పైపు వాల్వు పగిలి ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భారీగా ఉప్పొంగిన నీటి ప్రవాహానికి రుద్రూర్‌లోని బోధన్-బాన్సువాడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఎండబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. సుమారు 20 ఎకరాల ధాన్యం వరదలో కొట్టుకుపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్... కొట్టుకుపోయిన ధాన్యం
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మిషన్ భగీరథ పైప్‌లైన్ వాల్వు పగిలి కొట్టుకుపోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని రుద్రూరులో జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని వాపోయారు. కష్టపడి పండించిన ధాన్యం అంతా నీటి పాలు అయిందని అన్నదాతలు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి:'కన్నీరు కారిన చోటే ఆనందభాష్పాలు'