మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రికెటర్ అవతారం ఎత్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా తన క్రికెట్ ప్రతిభను బయట పెట్టారు. మోర్తాడ్‌లో తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి స్మారకర్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండగా.. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సందర్శించారు. మంత్రి బ్యాటింగ్ చేయగా.. తన పీఏ అరుణ్ బౌలింగ్ చేశారు.
క్రికెటర్ అవతారమెత్తిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి - Minister Prashant Reddy tour
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి క్రికెటర్ అయ్యారు. అదేంటి అనుకుంటున్నారా... నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా తన క్రికెట్ ప్రతిభను బయట పెట్టారు. మంత్రి బ్యాటింగ్ చేయగా.. తన పీఏ అరుణ్ బౌలింగ్ చేశారు.
క్రికెటర్ అవతారమెత్తిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
కొన్ని బంతులను ఎదుర్కొన్న మంత్రి చక్కని షాట్లు ఆడటంతో ఆటగాళ్లు, పార్టీ నాయకులు చప్పట్లతో అభినందించారు. మంత్రి హోదాలో ఎప్పుడూ అధికారిక పర్యటనలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో బీజీగా ఉండే ప్రశాంత్ రెడ్డి.. క్రికెట్ ఆడుతూ కొద్దిసేపు సరదాగా గడిపారు.
ఇవీచూడండి:రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి