నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బాలికల సమీకృత వసతి గృహాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. బాలికలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి బాలికలను అడిగారు. వసతి గృహంలో పరిసరాలు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల - బాలికల సమీకృత వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల
బోధన్ పట్టణంలోని బాలికల సమీకృత వసతి గృహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి బాలికలను అడిగి తెలుసుకున్నారు.
బాలికల వసతి గృహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం కృషిచేస్తుందన్నారు. బాలబాలికలకు వేర్వేరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి భోజనం అందిస్తుందన్నారు. వసతి గృహాల్లో బాలికలకు ప్రతి నెల రూ.500 అందిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారిదేనని కొనియాడారు. మంత్రితోపాటు జిల్లా అధికారిని శశికళ, ఆర్డీవో గోపి రామ్, పలువురు అధికారులు వసతిగృహాన్ని సందర్శించారు.
ఇదీ చూడండి :ప్రాణహాని ఉంది రక్షణ పెంచండి: ఎంపీ రేవంత్ రెడ్డి