తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్భయ భారతంలో ఇంకెన్ని అరాచకాలు - Married women struggle for justice in Nizamabad district

దేశానికి ఒక చట్టాన్నిచ్చి తాను కన్ను మూసింది ‘నిర్భయ’. రేపిస్టుల పాలిట బ్రహ్మాస్త్రమని, అబలలకు అభయమని హోరెత్తించిన ఈ చట్టం అమలులోకి వచ్చినా భయం పోలేదు. అత్యాచారాలు ఆగలేదు సరికదా... ఇంకా పెరిగాయి. ‘చంపేస్తా’మనే బెదిరింపులు పెరిగాయి. చంపేసిన కేసులూ పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం శంషాబాద్​లో పశువైద్యురాలిపై జరిగిన సంఘటనే ఓ ఉదాహరణ. నిజామాబాద్ జిల్లాలో తన అశ్లీల దృశ్యాలు చరవాణిలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి ఇంటి వద్ద వివాహిత ఆందోళన చేపట్టింది.

Married women struggle for justice in Nizamabad district
నిర్భయ భారతంలో ఇంకెన్ని అరాచకాలు

By

Published : Dec 1, 2019, 8:00 PM IST

నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత మహిళ న్యాయపోరాటానికి దిగింది. తన అశ్లీల దృశ్యాలు సెల్​ఫోన్​లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్​లో ఈ ఘటన కలకలం రేపింది.

ఉపాధి కోసం భర్త దుబాయ్​కి వెళ్లటం వ్లల రజిత అనే మహిళ ఇద్దరు పిల్లలను పోషిస్తూ నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి చనువు పెంచుకుని రజితను లోబర్చుకున్నాడు. ఆమె నగ్న దృశ్యాలను రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. శారీరకంగాను అనుభవించాడు. తనకు డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అవసర నిమిత్తం 12 లక్షలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వక పోవటం వల్ల విషయం భర్తకు తెలిసింది. ఆగ్రహించిన భర్త రజితను ఇంటి నుంచి గెంటి వేశాడు. బాధితురాలు రజిత తనను మోసం చేసిన ప్రదీప్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. అక్కడే వంటా వార్పు నిర్వహించారు.

పరారీలో ఉన్న ప్రదీప్​ను పట్టుకు రావాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడింది. తనను శారీరకంగా వాడుకుని నమ్మించి బ్లాక్ మెయిల్​తో డబ్బులు తీసుకున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.

నిర్భయ భారతంలో ఇంకెన్ని అరాచకాలు

ఇవీచూడండి: సీఎం కేసీఆర్​ స్పందించకపోవడం దారుణం : రేవంత్

ABOUT THE AUTHOR

...view details