తెలంగాణలో రైతులను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్(manickam tagore comments) అన్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి, పసుపు సాగు అధికంగా ఉంటుందని అన్నారు. ధాన్యం కొనబోమని తెరాస... పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి భాజపా రైతులను మోసం చేశాయని ఆరోపించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఎంపీగా గెలిచిన అర్వింద్.. ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీ బహిరంగ సభ
డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్న ఆయన.. అన్ని వర్గాల రక్షణ కోసం పోరాడుతున్న రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు నమోదు చేయాలని(T congress digital membership) కార్యకర్తలకు రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్ గాంధీభవన్(Revanth speech in gandhi bhavan) లో ఇటీవల ప్రారంభమైన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు.