ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహణపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలు, కుమారుడు, మరుదులు హాజరయ్యారు. అంతేకాక అధికారులను ప్రశ్నలు అడగడం, సలహాలు సూచనలు ఇవ్వడం గమనార్హం.
పురపాలక సమావేశానికి మహిళా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు - nizamabad district news
మహిళా రిజర్వేషన్లు అభాసుపాలవుతున్నాయి. పేరుకే మహిళా ప్రజాప్రతినిధులు.. వారి వెనక కుటుంబ సభ్యులే ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కార్యాలయంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహణపై జరిగిన సమావేశంలో మహిళా కౌన్సిలర్ల భర్తలు, కొడుకులు, మరుదులు హాజరయ్యారు.
పురపాలక సమావేశానికి కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు
పట్టణంలోని 36 వార్డులకు గాను 21వార్డులకు అతివలే కౌన్సిలర్లుగా ఉన్నారు. ఛైర్పర్సన్ వినీత, కమిషనర్ శైలజ సమావేశంలో ఉన్నప్పటికీ మహిళా ప్రతినిధులు రాకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఛైర్‌పర్సన్‌తో పాటు ఆమె భర్త పండిత్ పవన్ కూడా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఇవీ చూడండి: 'తెలంగాణలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'