నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నేతలను ఎంపీ కవిత కోరారు. ఈనెల 14న నిజామాబాద్‌లోని గిరిరాజ్ మైదానంలో జరగనున్న సన్నాహక సభపై.. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు.
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్న సమావేశానికి.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3వేల చొప్పున.. సుమారు 30వేల మంది హాజరవుతారని అన్నారు. వాహనాల పార్కింగ్, తాగునీరు, టాయిలెట్లఏర్పాటు తదితర అంశాలపై భేటీలో చర్చించారు.