తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో దేశద్రోహం కేసు

పుల్వామాలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం నివాళ్లు అర్పిస్తోంది. నిజామాబాద్​లో మాత్రం ముగ్గురు యువకులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా వారిపై దేశ ద్రోహం కింద కేసు నమోదైంది.

inda against slogans

By

Published : Feb 18, 2019, 8:42 PM IST

దేశద్రోహ కేసు నమోదు
పాకిస్థాన్​కు మద్దతుగా భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టిన యువకులపై నిజామాబాద్ జిల్లాలో దేశ ద్రోహం కింద కేసు నమోదైంది. మోర్తాడ్​లో దేశానికి వ్యతిరేకంగా నినదిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వాట్సాప్​లో వైరల్​ అయింది.

గమనించిన గ్రామస్థులు వారికి దేహశుద్ధి చేసి మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు. అందులో ఒకరు పరారయ్యాడు. నిందితులు మోర్తాడ్​లో హెయిర్ కటింగ్ సెలూన్​లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. మమ్మద్ షఫీ, మమ్మద్ సల్మాన్ ఉత్తర ప్రదేశ్​కు చెందినవారు కాగా.. షేక్ వాజిత్ మోర్తాడ్​కు చెందిన వ్యక్తి. ఈ ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details