Huge Money and Gold Seized in Police Checks in Telangana పోలీసుల తనిఖీల్లో లక్షల్లో దొరుకుతున్న డబ్బు.. రశీదు తప్పని సరి Huge Money Gold Seized in Telangana 2023 :ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అక్రమంగా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు దృష్టి సారించారు. వాహనాల తనిఖీల్లో రోజూ లక్షల కొద్దీ నగదు, బంగారం సహా ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. సరైన రసీదులు చూపని నగదు, బంగారాన్ని ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రూ.5 కోట్ల నగదు, ఏడు కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులు, సిబ్బందితో కమిషనర్లు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 24 గంటలు పని చేసేలా ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు(Police Checkings Telangana) తీసుకోవాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ చెక్‌పోస్టుల సంఖ్యను 11 నుంచి 18కి పెంచనున్నట్లు వెల్లడించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని నిర్దేశించారు.
Money Gold Seized in Hyderabad :హైదరాబాద్ కుల్సుంపుర ఠాణా పరిధిలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి 600 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపోవడం వల్ల ఎన్నికల అధికారులకు అప్పగించారు. చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో ఎస్ఓటీ పోలీసులు ఇద్దరి వ్యక్తుల నుంచి రూ.60 లక్షల నగదును జప్తు చేశారు. సరైన ఆధారాలు చూపనందున నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మహంకాళి ఠాణా పరిధిలో ఐదుగురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.29 లక్షల విలువైన 55 తులాల బంగారం పట్టుబడింది. ద్విచక్ర వాహనాలపై జనరల్ బజార్‌కు బంగారాన్ని తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు.
Police Implement Election Code in Telangana : రసీదు ఉంటేనే రక్షణ! ఎన్నికల కోడ్ వేళ తనిఖీలతో జాగ్రత్త.. ఈ పత్రాలు మర్చిపోకండి
Election Code in Telangana 2023 : దోమలగూడ, గాంధీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కారులో తరలిస్తున్న కేజీ బంగారంతో పాటు రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, బిల్లులు చూపిస్తేనే బంగారం తిరిగి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. ముషీరాబాద్ పరిధి భోలక్‌పూర్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి 8 మంది రౌడీషీటర్లను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Police Checking in Telangana As Election Code Kicks in :జగిత్యాల జిల్లా సరిహద్దు ఇబ్రహీంపట్నం గండి హనుమాన్ వద్ద అంతర్ జిల్లా సరిహద్దు పోలీస్ తనిఖీ కేంద్ర నూతన భవనాన్ని ఎస్పీ భాస్కర్ ప్రారంభించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా సాలూర శివారులో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్టును కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులతో కలిసి పరిశీలించారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.13 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో రూ.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి బ్రిడ్జి సెంటర్ వద్ద చెక్‌పోస్టును భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ సీఐ నాగరాజుతో కలిసి పరిశీలించారు. డబ్బు, మద్యం, బంగారం, వెండి, పేలుడు పదార్థాలు, మారణాయుధాలు రవాణాచేస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
EC Focus on Money Laundering in Telangana 2023 : ఈసీ పంచముఖ వ్యూహం.. రంగంలోకి రిజర్వ్ బ్యాంక్.. డిజిటల్ పేమెంట్స్‌పై దృష్టి
Cash Seized During Police Check in Hyderabad : ఎన్నికల కోడ్ అమలు.. 3 రోజుల్లోనే.. భారీ స్థాయిలో నగదు స్వాధీనం