ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు కురిశాయి. పలు మండలాల్లో భారీ వర్షాలు కురియగా... మరి కొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. బాల్కొండ, రెంజల్, మోర్తాడ్, నవిపేట్, మెండోరా, మాక్లూర్, ఇందల్వాయి, భీంగల్, ఆర్మూర్, ధర్పల్లి, సిరికొండ, బోధన్, జక్రాన్ పల్లి, నందిపేట్, కమ్మర్ పల్లి, వేల్పూర్ మండలాల్లో వర్షం కురిసింది. వర్షాలకు భీంగల్ మండలం ముచుకూర్లో చిన్నవాగు ఉప్పొంగుతోంది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్, రామారెడ్డి, పిట్లం, పెద్దకొడపగల్, బాన్సువాడ, సదాశివనగర్, కామారెడ్డి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, జుక్కల్, మద్నూర్ మండలాల్లో జల్లులు పడ్డాయి. వర్షాలతో నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
ఉమ్మడి నిజామాబాద్లో విస్తారంగా వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఉమ్మడి నిజామబాద్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తూ... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Heavy rains in Nizamabad District