కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ - కరోనా బాధితులకు సాయంగా ఆరెంజ్ ట్రావెల్స్
నిజామాబాద్ జిల్లాలో కరోనా సోకిన బాధితులకు వారి ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలను అందించడానికి సునీల్ సేన ఆధ్వర్యంలో రెండు సహాయ రథాలను ఏర్పాటు చేశారు.
కరోనా బాధితులకు నిత్యావసరాల పంపిణీ
నిజామాబాద్ జిల్లాలో కరోనా సోకిన బాధితులకు వారి ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలను అందించడానికి సునీల్ సేన ఆధ్వర్యంలో రెండు సహాయ రథాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ సతీమణి దీప్తి రెడ్డి, వారి అమ్మ సహయ రథాలను ప్రారంభించారు. ఈ రథాలు నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని గ్రామాలకు వెళ్లి కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తాయని పేర్కొన్నారు.