దోమకొండ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శరత్ కుమార్ ప్రారంభించారు. రైతులకు అన్యాయం జరిగితే ఉరుకునేది లేదని స్పష్టం చేశారు. చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - ధాన్యం కొనుగోలు కేంద్రం
రైతులు వద్ద నుంచి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుందని తెలిపిన సర్కార్ ఆ దిశగా అడుగులు వెస్తోంది. జిల్లాలోని దోమకొండ మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పంట అమ్మే రైతు బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావలని కలెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఒకేసారి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు రావద్దని సూచించారు. పంటను అమ్మే రైతు బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ తప్పని సరిగా తీసుకురావాలన్నారు. క్వింటా వరి రూ. 1760 గా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఇవీ చూడండి:పంట కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశాం: హరీశ్ రావు