నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,06,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 49,980 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.90 అడుగుల నీటి మట్టం ఉంది.
వరద తగ్గటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో 9 నెంబర్ గేట్ మొరాయించింది. గేటు మూసుకోకపవటంతో 3,000 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే గేట్ మొరాయించిందని తెలిపారు.