నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల అకాల వర్షం కురిసింది. మాచారెడ్డిలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, ధర్పల్లి, మాక్లూర్, డిచ్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో మోస్తరుగా వర్షం పడింది. ఇందళ్వాయి మండలం నల్లవెల్లిలో పసుపు, మొక్కజొన్న పంట తడిసింది. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం - నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం
నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందళ్వాయి మండలం నల్లవేలిలో పసుపు, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి.
అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం