Armoor Municipality: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో రూ.4.50 కోట్లతో నిర్మించునున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితమే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మార్కెట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.
Armoor Municipality: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవద్దని ఆందోళన - ఆర్మూర్ మున్సిపాలిటీ తాజా వార్తలు
Armoor Municipality: ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవద్దని రైతులు ఆందోళనకు దిగారు. అక్కడ మార్కెట్ నిర్మిస్తే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించవద్దని రైతులు ఆందోళన
అంగడిబజార్లోని శిలాఫలకం ఎదుట టెంట్ వేసుకొని పార్టీలకు అతీతంగా బైఠాయించారు. ఆ స్థలంలో వారం సంత నిర్వహిస్తున్నామని ఇప్పుడు మార్కెట్ నిర్మిస్తే తాము నష్టపోతామని వాపోయారు. పలువురు రైతులు శిలాఫలకం ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
ఇదీ చదవండి: 'పురుగు పట్టొద్దు.. పోషకాలు తగ్గొద్దు..' పప్పుధాన్యాలపై పరిశోధనలు
Last Updated : Mar 10, 2022, 4:26 PM IST