రైతుల శ్రేయస్సు కోసమే కేంద్రం నూతన రైతు చట్టాలు తీసుకొచ్చిందని భాజపా రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. నూతన రైతు చట్టాలను దేశ వ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారని.. ప్రతిపక్షాలు ప్రజల్లో అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో నూతన రైతు చట్టాలపై ఆయన మాట్లాడారు.
'సాగు చట్టాలను దేశవ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారు' - nizamabad news on farming acts
రైతు శేయస్సును దృష్టిలో పెట్టుకుని నూతన రైతు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని భాజపా రాష్ట్ర నాయకులు యెండల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. రైతు చట్టాలను దేశ వ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారని తెలిపారు.
రైతు చట్టాలను దేశ వ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారు
రైతులకు రెట్టింపు లాభం రావాలన్న లక్ష్యంతోనే పంట ఉత్పత్తుల విషయంలో చట్టాలను సవరించడం జరిగిందన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి ఈ చట్టాలను అమలు చేస్తూ జీవో జారీ చేశారని గుర్తు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కూడా మొదట స్వాగతించి తరువాత 'యు టర్న్' తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నూతన రైతు చట్టాలను దేశ వ్యాప్తంగా రైతులు స్వాగతిస్తున్నారని.. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించవద్దని కోరారు.
ఇదీ చూడండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు