బోధన్‌లో వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక - mpp
నేటితో ఎంపీపీ ఎన్నికలు పూర్తవుతాయనుకుంటే కొన్ని కారణాలతో పలుచోట్ల వాయిదాపడ్డాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదాపడింది.
వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన ఎంపీపీ ఎన్నికను తెరాస, కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకున్నారు. ఓటింగ్ అయిపోయాక రిటర్నింగ్ అధికారి వాయిదా వేశాడంటూ ఎంపీడీవో కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సర్దిచెప్పి పంపారు. బోధన్ ఆర్డీఓ గోపిరామ్ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారులతో చర్చించి ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.