విద్యుత్ బకాయిల వసూళ్లపై ఆ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. పేరుకుపోయిన బకాయిలు వసూలుకు ప్రభుత్వ విద్యాలయాలనూ వదిలిపెట్టడం లేదు. రూ. 15వేల బకాయి ఉన్నందుకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పక్షం రోజుల్లో బకాయిల కోసం ఒక్క బోధన్ పట్టణంలోనే పదిహేను పాఠశాలల్లో సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్య మూత్రశాలల వినియోగంపై ప్రభావం చూపనుంది. 50 మందికి పైగా విద్యార్థులున్న ఈ పాఠశాలలో విద్యుత్ బోరు, ఫ్యాన్ల వాడకానికి నెలకు రూ. 500 బిల్లు వస్తోంది. చెల్లింపులో జాప్యం వల్ల ఇప్పుడది రూ. 15,336కు చేరుకుంది.
ప్రభుత్వ బడులనూ వదలని విద్యుత్ శాఖ - govenrnament school
విద్యుత్ బకాయిలు వసూళ్లు చేసేందుకు ఆ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను కూడా వదిలిపెట్టడం లేదు.
ప్రభుత్వ బడులనూ వదలని విద్యుత్ శాఖ