తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్క్యూలర్‌ రద్దు చేయాలంటూ క్షేత్ర సహాయకుల ధర్నా - nizamabad

నిజామాబాద్‌ జిల్లాలోని పలు మండాలాల్లో పని చేస్తున్న క్షేత్ర సహాయకులు తమ సమస్యల సాధన కోసం మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 40 శాతం పని దినాలపై ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్‌ నంబర్‌ 4779 ను వెంటనే రద్దు చేయాలని కోరారు.

Dharna of field assistants for circular cancellation at nizamabad
సర్క్యూలర్‌ రద్దు చేయాలంటూ క్షేత్ర సహాయకుల ధర్నా

By

Published : Mar 13, 2020, 8:07 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో ఉపాధి హామీలో పని చేస్తున్న క్షేత్ర సహాయకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. 40 శాతం పని దినాలపై ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్‌ నంబర్‌ 4779 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పని ఒత్తిడి భారం మోపొద్దన్నారు. గత రెండు నెలలుగా చెల్లించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగునంగా కనీస వేతనాల చట్టం ప్రకారం నెలకు రూ. 21 వేలు వేతనం, బదిలీలు, పదోన్నతులు, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని విజ్జ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెలో పాల్గొంటామని చెప్పారు.

సర్క్యూలర్‌ రద్దు చేయాలంటూ క్షేత్ర సహాయకుల ధర్నా

ఇదీ చూడండి :భోజన పథకం బిల్లులేవీ ?? వంట ఎలా చేయాలి ?

ABOUT THE AUTHOR

...view details