నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్‌నగర్‌లో శనివారం రాత్రి గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ దళితసేన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. గౌతమ్‌నగర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు.
'బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలి'
గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట అంబేడ్కర్ దళితసేన ధర్నా చేపట్టింది.
'బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలి'
దుండగులను వెంటనే అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుద్ధుని విగ్రహాన్ని కావాలనే దుండగులు ముక్కలుగా చేశారని దీన్ని అంబేడ్కర్ దళితసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఆ సామర్థ్యం దిల్లీ తర్వాత హైదరాబాద్‌కే!