జవాబుల జిరాక్సులతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు..
14:34 August 14
జవాబుల జిరాక్సులతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు..
నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో ఓ జిరాక్స్ సెంటర్ వద్ద విద్యార్థులు జవాబులు జిరాక్స్ చేసుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లడం కలకలం రేపింది. ఇవాళ నిర్వహించిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్ష ప్రారంభం అయిన తర్వాత.. విద్యార్థులు జిరాక్స్‌లు తీసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రశ్నల సమాచారం బయటకు వచ్చిందన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లిన ఈటీవీ కెమెరాను చూసి విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పరీక్ష సమయం నుంచి అరగంట పాటు పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉండగా.. ఈ సమయంలో విద్యార్థులు బయట జిరాక్స్‌లు తీసుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రశ్నలు తెలిసి వాటికి సంబంధించిన జవాబులను తీసుకున్నారా లేక మాస్ కాపీయింగ్ కోసం మైక్రో జిరాక్స్ చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం గురించి తెలంగాణ యూనివర్సిటీ అధికారులను వివరణ అడిగితే.. తమ దృష్టికి రాలేదని.. వచ్చే పరీక్షలకు మరింత నిఘా పెంచుతామని పరీక్షల నియంత్రణ అధికారి నాగరాజు తెలిపారు.
ఇదీ చూడండి: BOY MURDER CASE: బాలుడు తనీష్రెడ్డి హత్య కేసు నిందితుడు అరెస్ట్