కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం గట్టుమైసమ్మ తండాలో నివాసముండే దేవులనాయక్, లక్ష్మణ్ నాయక్ గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకుని పేలడంతో తండావాసులు భయంతో పరుగులు తీశారు. అగ్ని శకలాలు అంటుకుని పరిసర ప్రాంతంలోని నాలుగు పశువులపాకలు దగ్ధమయ్యాయి. ఇళ్లల్లో ఉన్న రూ. లక్ష నగదు, 30 తులాల వెండి, తులం బంగారం, 30 క్వింటా వరిధాన్యం, పది క్వింటాళ్ల బియ్యం, బాధితుల పాస్‌పోర్ట్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
గుడిసెలో పేలుడు... భారీ ఆస్తి నష్టం.. - మంటలు అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం గట్టుమైసమ్మ తండాలో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి పశువుల పాకలు, ఒక గుడిసె దగ్ధమయ్యాయి. ఇళ్లల్లోని రూ. లక్ష నగదు, 30 తులాల వెండి, తులం బంగారం అగ్నికి ఆహుతయ్యాయి.
మంటలు అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
TAGGED:
cylinder blast