నిజామాబాద్ జిల్లాలో ర్యాపిడ్ పరీక్షల సంఖ్య పెరిగింది. కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని 15 ఆరోగ్య కేంద్రాల్లో మంగళవారం 1,101 మందికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేయగా 185 మందికి పాజిటివ్‌గా తేలిందని డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజన తెలిపారు.
ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 42, సీతారాంనగర్ యూపీహెచ్‌సీ పరిధిలో 23, వినాయక్‌నగర్‌లో 18, ధర్పల్లి సీహెచ్‌సీ పరిధిలో 14 మంది వైరస్ బారిన పడ్డారు. మిగిలిన 11 ఆరోగ్య కేంద్రాల్లో 3 నుంచి 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బోధన్ డివిజన్ పరిధిలో మంగళవారం కొత్తగా 70 కరోనా కేసులు నమోదయ్యాయి. డివిజన్ వ్యాప్తంగా 831 నమూనాలు సేకరించి పరీక్షించారు. అందులో రాకాసిపేట్ యూపీహెచ్‌సీలో 13, బోధన్ ఆస్పత్రిలో 11 అత్యధిక కేసులు నమోదయ్యాయి.