ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ర్యాపిడ్ టెస్టులు చేస్తుండటం వల్ల భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు 49 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 18కి చేరింది. మరో 114 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
ఉమ్మడి నిజామాబాద్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి - corona cases in kamareddy
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు 49 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కామారెడ్డి జిల్లాలో 40 మంది కొవిడ్ బారిన పడ్డారు.
corona cases in nizamabad district
కామారెడ్డి జిల్లాలో ఈ రోజు 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... కేసుల సంఖ్య మొత్తం 292కు చేరింది. యాక్టివ్ కేసులు 215 ఉండగా... ఈరోజు కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య ఐదుకు చేరింది. మరో 156 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని కామారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ తెలిపింది.