హరితహారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా సారంగాపూర్‌లోని జిల్లా జైల్లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మొక్కలు నాటారు.
'హరితహారం విజయవంతానికి ప్రజల భాగస్వామ్యం అవసరం'
హరితహారం కార్యక్రమాన్ని విజయమంతం చేసేందుకు ప్రజలూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. సారంగాపూర్‌లో జిల్లా జైల్లో ఆయన మొక్కలు నాటారు.
హరితహారం విజయమంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి
జైల్ నర్సరీలో పెంచిన మొక్కలను ఆయన పరిశీలించారు. గ్రీనరీ, బ్యూటిఫికేషన్ బాగుందని, నర్సరీని బాగా నిర్వహణ చేస్తున్నారని సూపరింటెండెంట్‌ను అభినందించారు. కలెక్టర్ వెంట జైల్ సూపరింటెండెంట్ ప్రమోద్, డిప్యూటీ జైలర్ ప్రకాష్ పాల్గొన్నారు.