నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో ఎనిమిది మండలాలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన బ్యాలెట్ పెట్టెలను భద్రపరచడానికి ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా పాలనాధికారి పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పోలింగ్ పకడ్బంధీగా చేపట్టాలని ఆదేశించారు.
బోధన్‌లో స్ట్రాంగ్ రూంను పరిశీలించిన జిల్లా కలెక్టర్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిజామాబాద్‌లో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. బోధన్ డివిజన్లో బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంను జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తనిఖీ చేశారు.
బోధన్‌లో స్ట్రాంగ్ రూంను పరిశీలించిన జిల్లా కలెక్టర్