కొవిడ్ వైరాలజీ ల్యాబ్‌తో పాటు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ జిల్లా ప్రజలకు ఎంతో అవసరమని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. డయాగ్నోస్టిక్ సేవలతో ఆస్పత్రుల్లో త్వరగా పరీక్షలు జరగాలని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భవనం సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన అని కలెక్టర్ తెలిపారు.
నిజామాబాద్ ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - nizamabad collector latest news
నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
నిజామాబాద్ ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక సందర్శన
కొవిడ్‌కు సంబంధించిన పరీక్షలు, ఇతర ఆరోగ్య పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రోజూ 150కి పైగా పరీక్షలు చేయవచ్చన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.