నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో కలెక్టర్ నారాయణరెడ్డి, మేయర్ దండూ నీతూ కిరణ్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. నగరంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ మొక్కలు నాటుతున్నామని మేయర్ దండూ నీతూ కిరణ్ తెలిపారు. మారుతున్న కాలంతో పాటు.. వాతావరణంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయని, వాటి వల్ల ఎన్నో అనర్థాలు జరిగి.. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
హరితహారంలో పాల్గొన్న నిజామాబాద్ కలెక్టర్, మేయర్ - హరితహారం
నిజామాబాద్ నగరంలోని ఐటీఐ కళాశాల మైదానంలో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి నగర మేయర్ దండు నీతూ కిరణ్ హరితహారంలో పాల్గొన్నారు. నగరంలో హరితహారం కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారని, విజయవంతంగా హరితహారం కొనసాగుతుందని మేయర్ అన్నారు.
హరితహారంలో పాల్గొన్న నిజామాబాద్ కలెక్టర్, మేయర్
ప్రకృతి సమస్యలకు పరిష్కారం సాధించాలంటే.. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని కాపాడుకోవడమే అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బీఎస్ లత, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి.పాటిల్, ఇతర సిబ్బంది, ఐటీఐ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గుడ్న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్!